HomePoliticalగోకులం షెడ్లు ప్రారంభించిన.. ఎమ్మెల్యే అమిలినేని

గోకులం షెడ్లు ప్రారంభించిన.. ఎమ్మెల్యే అమిలినేని

గత ప్రభుత్వం రైతులను విస్మరించి కనీసం పశువుల పోషణకు కూడా కనీసం ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం అండగా ఉండేందుకు ముందుగా పశువులు, గొర్రెలను వ్యాదుల బారిన పడకుండా ఉపాధి హామీ పథకం ద్వారా రైతు వాటా 10% తో గోకులం ( పశువుల) షెడ్లు నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..
నేడు కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో నిర్మించిన గోకులం (పశువుల) షెడ్లు ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి మండల టీడీపీ నాయకులు, మండల అధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు .. అనంతరం పశువుల షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని.. రైతులకు షెడ్లకు సంబంధించి డబ్బులు అకౌంట్ కు పడిన స్లిప్పులను రైతులకు అందజేశారు..


ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రైతు కష్టాలు తెలుకుని ముందుకు వెళ్తున్నాం.. ఈ మండలంలో 60 మొదటి విడతలో గోకులం షెడ్లు మంజూరు చేస్తే ఏకంగా 30 షెడ్లు పూర్తి చేయడం చాలా గొప్ప విషయం.. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఉంటాయి కాబట్టి 2000 వరకు షెడ్లు అవసరం పడతాయి.. కాబట్టి వచ్చే నెల 15 లోగ ఎస్టిమెట్లు వేసి పంపాలని అధికారులతో మాట్లాడి అర్హులైన అందరికి షెడ్లు నిర్మించుకునేలా చూస్తాం.. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పల్లెపండుగలో రైతులతో మమేకమై పనిచేయాలని కానీ ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాం.. ఇప్పటికే మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు కొంత వచ్చాయి మిగిలినవి కూడా ఎస్టిమెట్లు వేయించి నివేదికలు పంపాం త్వరలోనే మంజూరు వస్తే పూర్తి చేస్తాం.. బీటీపీ కాలువ కూడా రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని చెప్పాం తప్పకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్థాం.. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేసుకోవాలని రైతులు, ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు…అనంతరం సమీపంలోనే పొలంలో ఫారంపాండు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read