గత ఏడాది #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్‌తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్ టాలీవుడ్ నటుడు శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్లో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ అనంతరం దర్శకుడు ఆదిత్య హాసన్ ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్, ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను సంక్రాంతి పండుగ కానుకగా పంచుకున్నారు మేకర్స్. ప్రోడక్షన్ 32 అంటూ వస్తున్న ఈ చిత్రం #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో శివాజీ చిన్న కొడుకు పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించబోతున్నాడు. బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతున్నట్లు దర్శకుడు ఆదిత్య హసన్ ప్రకటించాడు.