HomeEntertainmentరాజమౌళి సినిమాకోసం..ప్రియాంక‌చోప్రా

రాజమౌళి సినిమాకోసం..ప్రియాంక‌చోప్రా

ప్రియాంకా చోప్రా ఆర్‌ఆర్‌ఆర్ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌ ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29) అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిందని నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. ప్రియాంకా చోప్రా తప్పకుండా ఎస్‌ఎస్‌ఎంబీ 29లో భాగం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నెట్టింట ఓ అభిమాని కామెంట్‌ చేయగా… ఆమె ఫైనల్ అయిందని భావిస్తున్నా. అయితే మాత్రం అద్భుతమైనదని చెప్పాలి.. అని మరో అభిమాని కామెంట్ చేశారు. నిజమైతే ఐదేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా చేయబోతున్న భారతీయ సినిమా ఎస్‌ఎస్ఎంబీ 29 కానుంది. మరి దీనిపై కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ బీహారీ సుందరి ఆ తర్వాత తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. తుఫాన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పింది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్‌ హెయిర్‌, గడ్డం, పోనీ టెయిల్‌ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ తెరకెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read