మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు’ అంటూ టీజర్‌తోనే ఫుల్ ఎంటర్టైనమెంట్ ఉండబోతుందని చెప్పాడు విశ్వక్. బార్బర్ సోన్, లైలా అనే రెండు పాత్రల్లో విశ్వక్ ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం డబుల్ మీనింగ్స్ డైలాగ్స్‌తో కట్ చేసిన ఈ టీజర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.