HomeEntertainmentజ‌న‌వ‌రి 20న.. భైర‌వం టీజ‌ర్

జ‌న‌వ‌రి 20న.. భైర‌వం టీజ‌ర్

భైర‌వం టీజ‌ర్ ని జ‌న‌వ‌రి 20న రిలీజ్ చేయ‌నున్నారు. హైద‌రాబాద్ అమీర్ పేట్ లోని ఏఏఏ సినిమాస్ లో లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.ఈ మేర‌కు కొత్త లుక్ ని రిలీజ్ చేశారు.విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ భైరవం . బెల్లంకొండ శ్రీనివాస్ , నారా రోహిత్ , మంచు మనోజ్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అదితీశంకర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. భైరవం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్‌ ఫస్ట్‌ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.

తాజాగా టీజర్‌ అప్‌డేట్ పోస్టర్ వదిలారు. మనోజ్‌, బెల్లంకొండ, నారా రోహిత్‌ ఒకే ఫార్మాట్‌లో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తూ టీజర్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మనోజ్‌ గజపతిగా కనిపించనుండగా.. నారా రోహిత్‌ వరద పాత్రలో కనిపించబోతున్నాడు.థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న భైరవంలో మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ పాత్రలు మాస్‌ అప్పీల్‌తో ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్‌, తాజా పోస్టర్‌ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img