హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పేద ప్రజలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అని తెలిపింది . సాయి పల్లవి తెలుగులో వరుసగా హిట్స్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది . సాయి పల్లవి మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మాదగ్గర అంతగా డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది అని నటి సాయి పల్లవితెలిపింది.