మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్, నయనతార నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్ ఆ పాత్రలో కనిపించడం లేదని. చిన్న పాత్రలోనే రెబల్ స్టార్ కనిపిస్తారని అంటున్నారు. కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.తాజాగా అక్షయ్ కుమార్ శివుడి లుక్ లో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. శివుడి గెటప్ లో అక్షయ్ ఆకట్టుకున్నారు. అలాగే పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.