ఇండియాలో మొట్ట మొదటి ఎయిర్టెట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ను బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది. ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.