నేషనల్ క్రష్ రష్మిక మందన్న కి ఇటీవలే ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా.. కాలికి గాయం అయింది. అప్పటి నుంచి రష్మిక ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. తాజాగా రష్మిక వీల్‌ఛైర్ పై దర్శనమిచ్చారు. కాలికి కట్టుతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన రష్మిక.. కారు దిగగానే వీల్‌ఛైర్‌లో కూర్చుని వెళ్లారు. ఆ సమయంలో ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకుని, తలకు క్యాప్‌తో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.