గతేడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్స్‌గా నిలిచాయి అమరన్, క. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క . 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం అమరన్ . అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న (ఆదివారం) ప్రీమియర్ కానున్నాయి. అమరన్ తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్‌లో సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీమియర్ కానుండగా.. క సినిమా సాయంత్రం 6 గంటల నుంచి ఈటీవీలో ప్రీమియర్ కానుంది.