యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది వైష్ణవి చైతన్య.చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అటు వరుస సినిమాల్లో నటిస్తూనే ఇటు జిమ్ లో తెగ కష్టపడుతుంది. తాజాగా ఈ బ్యూటీకీ సంబంధించిన క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వైష్ణవికి ఒక్కసారిగా మంచి గుర్తంపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. బేబీ తర్వాత తను నటించిన పలు చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.