HomeEntertainmentపెరిగిన నిడివితో..ఓటీటీలో పుష్ప‌2

పెరిగిన నిడివితో..ఓటీటీలో పుష్ప‌2

పుష్ప-2: ది రూల్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ. 1,896 కోట్లు కొల్లగొట్టి పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల వేటకు సిద్ధమైంది. గత అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప-2 అభిమానులకు మరింత సర్‌ప్రైజ్ ఇచ్చింది. రీలోడెడ్ వెర్షన్ నిడివిని మరింత పెంచింది. సంక్రాంతి తర్వాత థియేటర్‌లో విడుదల చేసిన రీలోడెడ్ వెర్షన్‌‌కు మరిన్ని సన్నివేశాలను ఇందులో జత చేశారు. దీంతో ఇప్పుడీ సినిమా నిడివి ఏకంగా 3.44 గంటలకు పెరిగింది. మూవీని డిసెంబర్ 5న విడుదల చేసినప్పుడు దాని నిడివి 3 గంటల 20 నిమిషాలు మాత్రమే. సంక్రాంతి తర్వాత మరో 20 నిమిషాలు కలపడంతో నిడివి 3.40 గంటలకు చేరుకుంది. ఇప్పుడు మరో 4 నిమిషాలు కలిపి ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప-2 స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read