బాగా పెరిగిన గిరజాల జుత్తు… గుబురు గడ్డం.. కోర మీసం.. చినిగిన నార బట్టలు ధరించి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వీధులలో చేసిన హడావుడికి జనం ఖంగు తిన్నారు.వీధుల్లో తిరుగుతున్నప్పుడు అమీర్ ఖాన్ ని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అమీర్ ఖాన్ కొత్త వేషధారణ రకరకాల ఊహాగానాలకు దారితీసింది. ఈ వేషం దేనికోసం? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇంతకుముందు పీకే చిత్రంలో నగ్నంగా కనిపించి షాకిచ్చాడు. కేవలం ఒక రేడియోను మాత్రం అడ్డు పెట్టుకుని అతడు వీధుల్లో వెళ్లే ఫోటో, వీడియో చాలా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ కేవ్ మేన్ గెటప్ దేనికోసం? బహుశా అతడు పీకే 2 కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నాడా? అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే చివరకు రహస్యం ఓపెనైంది. అమీర్ విచిత్రమైన గెటప్ కి కారణం వేరే ఉంది. ఇదంతా యాక్షన్-ప్యాక్డ్ థమ్స్ అప్ వాణిజ్య ప్రకటనలో భాగం అని తెలిసింది.