నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ . మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వేడుక రేపటికి ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ”ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలి యాట గురితప్పేదే లేదేస్” అంటూ పోస్ట్ పెట్టింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే.