HomePoliticalఢిల్లీ ఎన్నికల్లో.. పవన్ కల్యాణ్‌తో ప్రచారం?

ఢిల్లీ ఎన్నికల్లో.. పవన్ కల్యాణ్‌తో ప్రచారం?

దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ఆ పార్టీ.. తాజాగా కూటమిలోని కీలక నేతలను బీజేపీ తరఫున ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఢిల్లీలో కొన్ని లక్షల మంది తెలుగువారు ఉన్నారు. వీరిని తమ వైపు తిప్పుకునేందుకు పవన్ చేత ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం.. అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఇప్పుడదే సెంటిమెంట్‌ను ఢిల్లీలోనూ ప్రయోగించాలనుకుంటోంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపబోతుంది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. తెలుగువాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.అలాగే పవన్ కల్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. బహిరంగ సభలు, రోడ్‌ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కవుట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం లెక్కలేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img