HomeEntertainmentఆర్థిక ఇబ్బందులు..నిర్మాత సూసైడ్

ఆర్థిక ఇబ్బందులు..నిర్మాత సూసైడ్

కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిర్మాత కేపీ చౌదరి గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన నిర్జీవంగా కనిపించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్‌ చౌదరి. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన కబాలి సినిమా తెలుగు వర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, అర్జున్‌ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత కేపీ చౌదరికి కలిసి రాకపోవడంతో గోవాలో ఓమ్‌ పబ్‌ను స్టార్ట్‌ చేశాడు. అక్కడ కూడా లాస్‌ రావడంతో తనకు ఉన్న పరిచయాలతో సెలబ్రెటీలకు డ్రగ్స్‌ విక్రయాలు చేయడం మొదలుపెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి.హైదరాబాద్‌లోని వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులోనూ కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img