మహా కుంభ మేళా లో వైరల్ అయిన పూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోస్లే బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హిందీ సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’తో తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నటించేందుకు మోనాలిసా నుంచి రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా సంతకం కూడా తీసుకున్నారు. చిత్రీకరణ సైతం ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో తన సినీ ప్రయాణంపై మోనాలిసా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. థియేటర్ బయట అల్లు అర్జున్ పుష్ప-2 పోస్టర్ పక్కన నిలబడిన ఫొటోను మోనాలిసా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ బయట నిలబడ్డానని, త్వరలోనే పోస్టర్‌లో కనిపిస్తానంటూ తెలిపింది. ‘ఈ రోజు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం. అల్లు అర్జున్ పుష్ప-2’ అంటూ’ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.