ఫిబ్రవరి 12- హగ్ డే ప్రత్యేకత ఏమిటీ? అంటే…దీనికి సమాధానం ఇది.2025 హగ్ డే నాడు సెలబ్రిటీ కపుల్స్ హగ్ చర్చగా మారింది.రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంట తమ కుమార్తె రాహా కపూర్ తో కలిసి ఇదిగో ఇలా ఒక చెట్టుకు హగ్ ఇచ్చిన ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే, హగ్ డే
ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది అరుదైన ఆప్యాయతతో కూడుకున్న స్పర్శ. మీ జాబితాలోని రెండవ వ్యక్తితో షేర్ చేసుకోండి -అందరికీ హ్యాపీ హగ్ డే!
అంటూ ఆ కుటుంబం విషెస్ తెలిపింది. విక్కీ కౌశల్- కత్రిన కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వాణీ, రణవీర్ సింగ్ – దీపిక పదుకొనే జంటలు ఇలా వెచ్చని కౌగిలింతతో హగ్ డే -2025 కి ప్రత్యేకతను ఆపాదించారు. ఒక వెచ్చని కౌగిలి చాలా ప్రశాంతతను, హాయిని ఇస్తుందని ఈ జంటలు చెప్పకనే చెబుతున్నారు.