HomeEntertainmentరూ.10 లక్షలతో.. ఏపీజేయూ జర్నలిస్టుల సంక్షేమ నిధి..!

రూ.10 లక్షలతో.. ఏపీజేయూ జర్నలిస్టుల సంక్షేమ నిధి..!

యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు

  • డా.చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం
    -పెద్ద ఎత్తు జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ప్రకటన
    -కంచర్ల సినిమా రిలీజ్ రోజునే ఏపీజేయూ బ్యాంకు ఖాతాలో రూ.10లక్షలు జమ
    -విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యానికి, అండగా ఉంటామని భరోసా

విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 లక్షలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రెరీలో డా.చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయూ గౌరవాధ్యక్షలుగా నియమితులైన సందర్భంగా డా.కంచర్లకు భారీ సత్కారం, ఘన సన్మానం జరింగింది. ఈ సంద్భంగా డా.కంచర్ల మాట్లాడుతూ, సమాజంలో నాలుగ‌వ స్థంబంలా ఉన్న జర్నలిస్టులు, మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులన్నా, మీడియా అన్నా తను ఎనలేని అభిమానమన్నారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 లక్షలను ఏపీజేయూ ద్వారా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి. వాటి ద్వారా జర్నలిస్టుల సంక్షేమం చేపట్టనున్నామన్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల ఆరోగ్యానికి భరోసా ఉంటామన్నారు. అదేవిధంగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా కూడా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు. రెండు మూడు రోజుల్లోనే జర్నలిస్టులకు ఏ తరహా సంక్షేమం చేస్తామనే కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన హౌసింగ్, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల తదితర వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఏ జర్నలిస్టులకి ఎప్పుడు ఏ ఆపదవచ్చినా తాను ఉన్నానే విషయాన్ని ఎవరూ మరిచి పోవద్దన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఏపీజేయూ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించి ఇచ్చిన గౌరవాధ్యక్షుని పదవికి వన్నెతేవడంతోపాటు, రాష్ట్రంలో యూనియన్ పటిష్టతకు, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

జర్నలిస్టులు ఆర్ధిక ఇబ్బందులు, సమస్యలు తీర్చే విధంగా ఏపీజేయూ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు. ఏపీజేయూ కార్యాచరణను ప్రకటించి, పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఏపీజేయూ రాష్ట్ర ప్రతినిధి పి.బాలభాను(ఈరోజుబాలు) మాట్లాడుతూ, డా.కంచర్ల అచ్యుతరావు మీడియాకి చేస్తున్న సేవలను కొనియాడారు. ఏ ఒక్క జర్నలిస్టుకి ఆరోగ్యం బాగా లేకపోయినా తక్షణమే స్పందించి ఆర్ధిక సహాయం చేసే వ్యక్తి ఒక్క కంచర్ల మాత్రమేనన్నారు. ఎవరైనా జర్నలిస్టు మృతిచెందినా.. కుటుంబ సభ్యులు మృతిచెందినా మట్టి కర్చులు, దసదిన ఖర్మ భోజనాలు సైతం ఏర్పాటు చేసి జర్నలిస్టు పాలిన పెద్దన్నగా నిలిచిపోయారని కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే.. జర్నలిస్టుల సంక్షేమానికి మాత్రం డా.కంచర్లే పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు. కష్టమైనా, నష్టమైనా, అర్ధరాత్రైనా జర్నలిస్టులకు అండగా ఉంటూ నిరంతర మీడియా సేవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయారని అన్నారు. అనంతరాయం ఆయననుఘనంగా సత్కరించారు. పిదప డా.కంచర్ల అచ్యుతరావుని డా.చిరంజీవి కళాపీఠం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ భారీ సన్మాన కార్యక్రమంలో గజమాల సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, అరుణ, రవి, కంచర్ల యువసేన ప్రతినిధులు, గెంబలి జగదీష్, వరప్రసాద్, ఇంద్ర ప్రయదర్శిని, చెన్నా తిరుమల రావు, నెహ్రూ, రిటైర్డ్ ఏడీసీపి ఖాన్, భయ్యా శ్రీనివాస్, మనుపల్లా, కంచర్ల డైరెక్టర్ యాద్ కుమార్, ఎస్ఎస్ఎల్ ఎస్ క్రియేషన్స్ మేనేజర్ సూర్యప్రకాష్, పెంకి సురేష్, ఆదర్శ నగర్ గ్రామ సంఘ సభ్యులు, క్రికెట్ అసోసియేషన్ సభులు, వివిధ కళారంగాల ప్రతినిధులు, అన్నమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, కిరణ్మయి నృత్యాలయం ప్రతినిధి దాసు, పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని కంచర్లకు శుభాకాక్షలు తెలియజేశారు. అంతకు ముందు చిన్నారులు చేసిన నృత్యాలు, కోలాటం, సంగీత విభావరిలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img