మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్‌ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ వివాదంలోమోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కాగా, భాకారాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్‌లో మనోజ్ బస చేస్తున్నారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత పెట్రోలింగ్‌లో భాగంగా మనోజ్ వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడ సెలబ్రిటీలకు అంత సురక్షితం కాదని సూచించారు. అయితే పోలీసుల డ్రామా అంటూ వారి తీరును తప్పుపట్టిన మనోజ్.. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.