స్టార్ హీరో ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుంది. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకే ఈ మూవీ టైటిల్ ‘ఫౌజీ’ అయితే బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో కీలకమైన బ్రిటిష్ యువరాణి పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువరాణి పాత్ర ఈ సినిమాలో కీలకం కావడంతో.. ఆలియా భట్‌ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు.