HomeEntertainmentఅనుకున్న డేట్ కే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

అనుకున్న డేట్ కే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాపై చిత్ర నిర్మాత ఏఎం ర‌త్నం తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ముందుగా చెప్పిన‌ట్టు మార్చి 28నే థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వెల్లడించారు ఎవ‌రికీ ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అనుకున్న స‌మ‌యానికి సినిమాను విడుద‌ల చేస్తాం. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాం” అన్నారు. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్రం యూనిట్ కీల‌క అప్‌డేట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ ‘కొల్లగొట్టిందిరో’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ ను ఫిబ్రవరి 24న‌ మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. దీంతో ఈ పాట కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిర్మాత మూవీ విడుద‌ల తేదీలో ఎలాంటి మార్పు లేద‌ని చెప్పి, అభిమానుల‌ను మ‌రింత ఖుషీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read