విరాజీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కానీ రూ.99 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఆగస్ట్ 22నే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి వచ్చేసింది ఈ మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రెంటల్ విధానంలో ఎంట్రీ ఇచ్చింది.డైరెక్టర్ ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ కీలకపాత్రలు పోషించారు.