HomeEntertainment'దృశ్యం 3' ప్రాజెక్ట్ ఫిక్స్

‘దృశ్యం 3’ ప్రాజెక్ట్ ఫిక్స్

సస్పెన్స్‌, థ్రిల్లింగ్ అంశాలతో ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది దృశ్యం . జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళం నుంచి వ‌చ్చిన ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ రాబోతుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు. దృశ్యం 3 ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందంటూ మోహ‌న్ లాల్ రాసుకోచ్చాడు. దీంతో త్వ‌ర‌లోనే దృశ్యం 3 ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌ల‌యాళం వెర్ష‌న్‌లో మోహన్‌ లాల్‌, మీనా నటించగా.. తెలుగు వెర్షన్‌లో వెంకటేశ్‌, మీనా, హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరన్‌ నటించారు. ఇక విడుద‌లైన అన్ని భాషల్లో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img