సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాజీ భార్య సైరా బాను ఆకస్మిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సైరా బానుకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సైరా బాను న్యాయవాది వందన షా సైరా బాను ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలియజేశారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ సైరా బాను కృతజ్ఞతలు తెలిపారని, ఈ సమయంలో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ షా ధన్యవాదాలు తెలిపారు.తనకు సహకరించిన వారిలో తన మాజీ భర్త ఎ.ఆర్. రెహమాన్‌కు కూడా సైరా బాను కృతజ్ఞతలు తెలిపారు. దీనితో పాటు లాస్ ఏంజిల్స్‌లోని తన స్నేహితులు రసూల్ పూకుట్టి, అతడి భార్య షాదియాకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే సైరా బాను ఆసుపత్రిలో చేరడానికి కారణం వెల్లడి కాలేదు.