నవంబర్ 2 శనివారం విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో సీఎం చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా, విజయనగరం పర్యటన రద్దయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు చేరుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు హెలికాఫ్టర్‌లో చింతలగోరువాని పాలెంలోని లారస్ సంస్థ వద్దకు చేరుకుంటారు. సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకోనున్నారు. అక్కడ రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాఫ్టర్‌లో రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.