HomeEntertainmentఆటో డ్రైవ‌ర్ గా..స్టార్ హీరో

ఆటో డ్రైవ‌ర్ గా..స్టార్ హీరో

బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ఖాన్ , సంజయ్‌దత్‌ కలిసి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఒక హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ ఇద్దరూ ముందుకొచ్చారు. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ‘సెవెన్‌ డాగ్స్‌’ రీమేక్‌లో వీరిద్దరూ ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు చెందిన ఫస్ట్‌ లుక్‌ తాజాగా బయటకు వచ్చింది. ఆటో డ్రైవర్‌ డ్రెస్‌లో సల్మాన్‌ కనిపించారు. అతని పక్కనే సూట్‌ ధరించిన సంజయ్‌ దత్‌ నిలబడి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img