HomeEntertainmentగంగూలీగా..రాజ్ కుమార్

గంగూలీగా..రాజ్ కుమార్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీలో దాదా పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. తాజాగా ఇదే విష‌యంపై గంగూలీ స్పందించాడు.
”నేను విన్నంత‌వ‌ర‌కు నా బ‌యోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు న‌టించ‌బోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఇది ప్ర‌క‌టించిన అనంత‌రం తెరపైకి రావ‌డానికి కనీసం సంవ‌త్స‌రం కంటే ఎక్కువ స‌మ‌యం ప‌డుతుందంటూ” గంగూలీ చెప్పుకోచ్చాడు. మ‌రోవైపు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రాజ్ కుమార్ రావుని సంప్ర‌దించ‌గా.. అత‌డు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెర‌కెక్కించనుండ‌గా.. విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వ‌హించ‌నున్నాడు. మ‌రోవైపు ఇప్ప‌టికే పారిశ్రామిక వేత్త‌ శ్రీకాంత్ బ‌యోపిక్‌లో న‌టించిన రాజ్ కుమార్ రావు దాదా బ‌యోపిక్‌లో న‌టిస్తే ఎలా ఉంటాడో అని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img