నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు . పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను పంచుకుంది.ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అనే రెండో సింగిల్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కోర కోర మీసాలతో కోదమ కోదమ అడుగులతో.. జర జర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు అంటూ విడుదల చేసిన ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాటలో నిధి ఆగర్వాల్‌తో పాటు అనసుయ కూడా తళుక్కున మెరిసింది.