టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్లో వస్తున్న తాజాగా చిత్రం మజాకా. రావు రమేశ్ హీరోకు తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. తండ్రి కొడుకులు ఇద్దరూ ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ, పెళ్లితో ఫుల్ లెంగ్త్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొచ్చి బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. జై బాలయ్య అనాలి అంటూ ట్రైలర్ ఆద్యంతం నవ్వించారు. మజాకా సినిమాలో రీతువర్మ కథానాయికగా నటిస్తుండగా మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.