ప్రముఖ తెలుగు యూట్యూబర్, మత్స్యకారుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు విశాఖపట్నం పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ RTC ఎండీ సజ్జనార్ ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్‌ను కేసు నమోదు చేయాలని కోరడంతో ఈ చర్య తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుద్ధమని సజ్జనార్ ఆరోపించారు. ఈ కేసులో నానిని ఫిబ్రవరి 22, 2025న అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది, అయితే అధికారిక దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు లోకల్ బాయ్ నాని తెలంగాణ RTC ఎండీ సజ్జనార్‌కి క్షమాపణలు తెలిపాడు. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను… నేను చదువుకోలేదు అందుకోసమే ఇలా చేసాను.సజ్జనార్‌కి సారీ చెప్తున్న ఇలాగే అందరికి బుద్ది వచ్చేలా చేయాలి. అంటూ నాని చెప్పుకోచ్చాడు.