కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు..క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు అన్నారు బొత్స సత్యనారాయణ..స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా.. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలని.. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చెయ్యద్దు..ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది..చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. .: పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదన్నారు..ఈ ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది..
ముఖ్యమంత్రి వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలన్నారు..: ఇసుక ఇచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు..గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది..నాడు విశాఖలో ఇసుక రూ 13వేలకు వచ్చేది..విశాఖలో ఎప్పటి నుంచి తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వస్తుందో చెప్పాలి..రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీనించాయి.. రాష్ట్రంలో చట్టం ఒక పక్షం వహిస్తుంది..చట్టం నాలుగు పాదాలపై ఉండాలి..ఏకపక్షం వహించడం మంచిది కాదన్నారు..