తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆప్‌కమింగ్ సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే జైలర్ 2 అనౌన్స్‌మెంట్ ఇచ్చిన తలైవా మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పూజా హెగ్దే ప్రస్తుతం దళపతి విజయ్‌తో కలిసి జన నాయగన్ అనే చిత్రంలో నటిస్తుంది.