HomeEntertainmentమ‌హేశ్ బాబు.. న్యూలుక్

మ‌హేశ్ బాబు.. న్యూలుక్

టాలీవుడ్ ద‌ర్శ‌క దిగ్గజం ఎస్‌.ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేశ్ కొత్త లుక్‌కి సంబంధించి ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ‌మౌళితో పాటు ఈ సినిమా కోసం మ‌హేశ్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్ప‌టికే జ‌ట్టు గ‌డ్డం పెంచేసి లుక్స్ మొత్తం మార్చేసిన మ‌హేశ్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్​ చేస్తున్నాడు. అయితే మ‌హేశ్ జిమ్‌లో ఎక్స‌ర్‌సైజ్ అనంత‌రం అద్దం ముందుకు వెళ్లి త‌న లుక్‌ని చూసుకుని బ‌య‌ట‌కు వెళ్లే వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో జుట్టు మొత్తం వ‌దిలేసి ర‌గ్గ‌డ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్​లోకి దూసుకెళ్లింది. ఇక వీడియో చూసిన అభిమానులు బాబు కొత్త లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read