భారతదేశం ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర రైల్వే శాఖది. అటు ప్రయాణికులను, ఇటు సరకు రవాణాలోనూ భారతీయ రైల్వే రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తుంది.భారతీయ రైల్వే తాజాగా 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను రూపొందించింది.మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయంలో భాగంగా గుజరాత్ లోని దాహోద్ ఫ్యాక్టరీలో ఈ ఇంజన్ ను తయారు చేశారు.ఈ ఇంజిన్ వచ్చే నెలలో ట్రాక్‌లపై పరుగులు తీయనున్నదని సమాచారం. భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లను 6000 హార్స్‌పవర్ నుండి 9000 హార్స్‌పవర్ కు అప్ గ్రేడ్ చేస్తోంది.ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ గుజరాత్ లోని దాహోద్ లో రూ.20,000 కోట్ల ఖరీదు చేసే 9,000 హార్స్ పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను తయారు చేయనుంది.9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్ 4,500 టన్నుల సరుకును మోసుకెళ్లే గూడ్స్ రైలును అధిక వేగంతో నడుపుతుంది. ఒక సాధారణ ట్రక్కు 7 నుండి 10 టన్నుల వస్తువులను మాత్రమే తీసుకువెళుతుంది.ఈ నూతన ఇంజిన్లతో రైళ్ల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు పెరగనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ ఇంజిన్ తయారు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు.