HomePoliticalఐడీఎఫ్‌ దాడుల్లో.. పొలిటికల్‌ బ్యూరో చీఫ్ మృతి

ఐడీఎఫ్‌ దాడుల్లో.. పొలిటికల్‌ బ్యూరో చీఫ్ మృతి

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హమాస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్‌ దళాలు అంతమొందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ పొలిటికల్‌ బ్యూరో చీఫ్ ఇజ్ అల్-దిన్ కసబ్ ను కూడా ఐడీఎఫ్‌ హతమార్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్ తాజాగా ధ్రువీకరించింది.


హమాస్‌ పొలిటికల్‌ బ్యూరోలో నేషనల్‌ రిలేషన్స్‌ హెడ్‌గా కసబ్‌ వ్యవహరిస్తున్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. తాము జరిపిన వైమానికి దాడుల్లో కసబ్‌తోపాటు ఆయన సహాయకుడు అయ్‌మన్ అయేష్ కూడా హతమైనట్టు పేర్కొంది. మరోవైపు కసబ్‌ మృతిని హమాస్‌ కూడా ధ్రువీకరించింది. ఆయనతోపాటు మరో అధికారి కూడా మరణించినట్టు తెలిపింది. అయితే, ఐడీఎఫ్‌ చెబుతున్నట్టు కసబ్‌ హమాస్‌లో అత్యధిక ర్యాంకులో లేడని.. స్థానిక గ్రూపు అధికారి మాత్రమేనని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img