HomePoliticalచంద్ర‌బాబుని క‌లిసిన‌..గాదె శ్రీనివాసులు నాయుడు

చంద్ర‌బాబుని క‌లిసిన‌..గాదె శ్రీనివాసులు నాయుడు

ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీనివాసులు నాయుడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తన విజయానికి అన్ని విధాలా సహకారం అందించారంటూ ముఖ్యమంత్రికి, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచినందుకు శ్రీనివాసులు నాయుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించార. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… టీచర్ల సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారిని అన్ని వేళలా గౌరవిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశేషంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయాలు ప్రకటిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read