గూఢచారి థ్రిల్లర్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులు ఇప్పుడు హై యాక్షన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. ఇప్పుడీ స్పై థ్రిల్లర్ మూవీ సోనీ లివ్‌లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు. వీరు తమ నటనతో సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.