దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్ల నుంచి కీలక సూచనలు తీసుకొని బడ్జెట్లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏటా బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుందని తెలిపారు. మళ్లీ పార్లమెంట్ మొదలయ్యాక ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరిపి ఆమోదం ఉంటుందన్నారు. సూచనలు వస్తే సవరణలు చేసి బడ్జెట్ను ఆమోదిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.