HomeEntertainmentసోనాక్షి సిన్హా.. ‘జటాధర ఫ‌స్ట్ లుక్

సోనాక్షి సిన్హా.. ‘జటాధర ఫ‌స్ట్ లుక్

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె న‌టిస్తున్న ప్రాజెక్ట్ నుంచి మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు. న‌టుడు సుధీర్‌ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘జటాధర . ఈ సినిమాకు వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టి సోనాక్షి సిన్హా న‌టించ‌బోతున్న‌ట్లు గత కొన్నిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ మేక‌ర్స్ మూవీ నుంచి సోనాక్షి సిన్హా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు.నేడు వుమెన్స్ డేని పుర‌స్క‌రించుకుని ‘జటాధర నుంచి సోనాక్షి సిన్హా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేయ‌గా.. ఈ ఫ‌స్ట్ లుక్‌లో సోనాక్షి శక్తివంతమైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మైథాలాజిక‌ల్, సూప‌ర్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read