అఖిల్ చాలా కథలు కూడా విన్నాడు. ఎన్నో కథలు విన్న అఖిల్ ఓ కథ దగ్గర ఆగాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ నందు చెప్పిన కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మార్చి 14 నుంచి మొదలు కానున్నట్టు సమాచారం. మొత్తానికి రెండేళ్ల తర్వాత అఖిల్ తిరిగి సినిమా సెట్స్ లో కాలు పెట్టబోతున్నాడన్నమాట.వాస్తవానికి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కథను కావాలని సాహు గారపాటి రెడీ చేయించుకున్నారట. కథ గురించి విన్న నాగార్జున సాహుని రిక్వెస్ట్ చేసి మరీ ఆ కథను కావాలని తీసుకున్నారట. అక్కినేని ఫ్యామిలీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు బాగా కలిసొస్తాయని, అఖిల్ కోసం అలాంటి కథనే వెతుకుతున్నామని చెప్పి, నాగ్ ఆ కథను సాహు నుంచి తీసుకున్నారట. ఇప్పుడు ఆ కథతోనే నాగార్జున తన సొంత బ్యానర్ లో అఖిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ చిత్తూరు జిల్లాలోనే ఉంటుందని, సినిమాలో చిత్తూరు యాస కూడా ఉంటుందని, చిత్తూరు ఏరియాలోని భారతం మెట్ట అనే కొండప్రాంతంలో అఖిల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్కువగా జరగనుందని సమాచారం.