HomeEntertainmentరోష‌న్ బ‌ర్త్ డే..ఛాంపియ‌న్ గ్లింప్స్

రోష‌న్ బ‌ర్త్ డే..ఛాంపియ‌న్ గ్లింప్స్

హీరో శ్రీకాంత్ త‌న‌య‌డు రోష‌న్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నాలుగు ఏండ్లు అవుతుంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసంద‌D లాంటి సినిమాల‌తో అల‌రించిన రోష‌న్ ఆ త‌ర్వాత మ‌రో మూవీ సైన్ చేయ‌లేదు. అయితే చాలా రోజుల త‌ర్వాత రోష‌న్ కొత్త మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యాన‌ర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రోష‌న్ బ‌ర్త్‌డే కానుక‌గా మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ వీడియో చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఫుట్‌బాల్ ఆట‌ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమాలో రోష‌న్ రెండు కొత్త లుక్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read