HomeEntertainmentవైర‌ల్ గా.. మ‌హ్ వ‌శ్ పోస్ట్

వైర‌ల్ గా.. మ‌హ్ వ‌శ్ పోస్ట్

డాన్సర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ధ‌న‌శ్రీ వ‌ర్మ‌తో విడాకుల అనంత‌రం టీమ్‌ ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. యూట్యూబ‌ర్, రేడియో జాకీ మహ్‌వశ్ తో చాహ‌ల్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు బీ టౌన్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా దుబాయ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌ను వీరిద్ద‌రు క‌లిసి చూడ‌డం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయ‌డం వ‌ల‌న ఈ వార్త‌ల‌కు బ‌లం చేకురింది. దీంతో చాహ‌ల్ మహ్‌వశ్‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు టాక్ న‌డుస్తుంది. మ‌హ్‌వ‌శ్ పెట్టిన ఒక‌ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.
ఇన్‌స్టా వేదిక‌గా మ‌హ్‌వ‌శ్ స్టోరీ పెడుతూ.. రీసెంట్‌గా త‌న‌కు బెస్ట్ ఇన్‌ప్లూయెన్స‌ర్ అవార్డు రావడంపై స్పందించింది. ”నేను ఈ స్థాయికి చేరడం చూస్తే చిన్నప్పటి మహ్‌వశ్‌ ఎంతో సంతోషిస్తుంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఎలాంటి తప్పులు చేయకుండా, అసత్యాలను లెక్కచేయకుండా, మనం మన పనిని నిజాయితీగా చేస్తూ ముందుకు వెళ్లాలి అంటూ రాసుకోచ్చింది. అయితే డేటింగ్ రూమర్స్ వ‌స్తున్న వేళ మీడియాకు కౌంట‌ర్‌గా మ‌హ్‌వ‌శ్ ఈ పోస్ట్ పెట్టిన‌ట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read