బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్ మేనల్లుడైన అమన్ దేవ్‌గణ్ , స్టార్ నటి రవీనా టండన్ కూతురు రషా థడానీ జంటగా నటించిన తొలి చిత్రం ‘ఆజాద్’. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విమర్శల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.