తమిళనాడుకి చెందిన మాళవిక మోహనన్ డస్కీ లుక్స్ లో కనిపిస్తూ మంచి బోల్డ్ నెస్ ని కనబరుస్తుంది. ఇలా సౌత్ నుంచి హిందీ సినిమాకి కూడా మాళవిక మోహనన్ క్రేజ్ పాకింది. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఉందని వచ్చిన రూమర్స్ తో తెలుగు ఆడియెన్స్ లో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం తన డెబ్యూ తెలుగు సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కలయికలో ది రాజా సాబ్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ సినిమాతో తెలుగులో పాతకు పోవాలని చూస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అభిమానులతో ముచ్చటించింది . అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
ఈ క్రమంలో ఓ క్రేజీ అభిమాని మాళవికాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దానికి మాళవిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.. మీరు కోరుకునే భర్త.. మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి.. ది బెస్ట్ హజ్బెండ్‌లా ఉండాలని అనుకుంటున్నాను దీనికి మీ సమాధానం ఏంటని అడగగా, అందుకు మాళవిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేను ఇప్పుడు పెళ్లికి సిద్దంగా లేను.. ఇప్పుడు నాకు భర్త వద్దు అని పేర్కొంది. ఓ నెటిజన్ జాంబీగా మారితే ఏ హీరోతో ఉంటావ్ అని అడగగా, దానికి ప్రభాస్ పేరు చెప్పింది. ప్రభాస్ అయితే పక్కన ఉన్న వారికి సరిపోయేంత ఫుడ్ తీసుకొస్తాడు కాబట్టి జాంబీగా మారినప్పుడు ఇక నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది మాళవిక.