భూమి పెడ్నేకర్ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌లో ఒక కోర్సు పూర్తి చేసింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నాయకత్వం, గ్లోబల్ పాలసీ& లైఫ్ పై ప్రత్యేక కోర్సును పూర్తి చేసినట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది. పాఠశాలకు తిరిగి వెళ్లడం వల్ల సవాల్‌ని ఎదుర్కొన్నా కానీ.. తన సంతృప్తికరమైన అనుభవాలను వివరించింది. భూమి తన స్టడీస్ సమయంలోని అందమైన జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోల రూపంలో పొందుపరిచింది. సామాసిక మాధ్యమాల్లో గర్వంగా తన సర్టిఫికెట్‌ను ప్రదర్శించింది. హార్వర్డ్‌లో తన అరుదైన క్షణాలను గుర్తుచేసుకుంది.
వర్శిటీ స్టడీ సమయంలో న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్‌ను కలిసిన విషయాన్ని కూడా భూమి గుర్తు చేసుకుంది. ఆర్డెర్న్ నాయకత్వంపై భూమి ప్రశంసలు కురిపించింది. తన సహచరులతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. మారుతున్న వాతావరణంపై ఉపన్యాసాలకు హాజరు కావడం, డేవిడ్ రూబిన్స్టెయిన్ – లారీ సమ్మర్స్ వంటి ప్రభావవంతమైన వక్తల స్పీచ్ లను వినడం, క్యాంపస్ సంప్రదాయాలను ఆస్వాధించడం వగైరా చాలా ఉన్నాయి. 1636లో నిర్మించిన హార్వార్డ్ లైబ్రరీ గురించి భూమి ప్రస్థావించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే… భూమి చివరిసారిగా అర్జున్ కపూర్ – రకుల్ ప్రీత్ సింగ్‌లతో కలిసి మేరే హస్బెండ్ కి బివి
లో కనిపించింది.
