HomeEntertainmentహాస్ప‌ట‌ల్ బెడ్ పై.. స‌మంత‌

హాస్ప‌ట‌ల్ బెడ్ పై.. స‌మంత‌

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుకు జత చేసిన ఫొటోను చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి బెడ్ పై సమంత పడుకుని ఉండగా ఆమె చేతికి సెలైన్ ఎక్కిస్తుండడం ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైంది, ఆమె అరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సమంత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో సమంత అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ సినిమాలో నటిస్తున్న సమంత.. ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అందులో కీలక పాత్రలో నటిస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తొలి ప్రాజెక్టు ‘శుభం’ షూటింగ్ ను ప్రారంభించింది. అయితే, తాజాగా సమంత ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read