HomeEntertainmentపుష్ప‌2,బాహుబ‌లి 2 రికార్డ్స్ ని బ్రేక్.. చేసిన‌ ఛావా

పుష్ప‌2,బాహుబ‌లి 2 రికార్డ్స్ ని బ్రేక్.. చేసిన‌ ఛావా

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ముద్దుగా ఛావా అని పిలిచేవారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం కాగా, శివాజీ సింహం అయితే.. ఆయన కుమారుడు సింహం పిల్ల ‘ఛావా’ అని పేరు. అయితే ఛావా ఒక పేరు కాదు, ఒక ఎమోష‌న్. ఛావా పేరుతో బాలీవుడ్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో రికార్డులు చెరిపేస్తుంది. చారిత్రక చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైన తర్వాత కూడా ఈ మూవీకి జ‌నాలు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు ఈ మూవీకి జ‌నాలు క్యూ క‌డుతున్నారు. ఆలస్యంగా రిలీజైనప్పటికీ ఛావా తెలుగు వెర్షన్ పదిహేను కోట్లను దాటేసింది. ఒకవేళ కోర్ట్ కనక దూకుడుగా లేకపోయి ఉంటే ఛావా సినిమా పాతిక కోట్లు సులువుగా లాగించేది.ఇప్పటి వరకు ఈ చిత్రం 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, ఐదో వీకెండ్‌లో మరో 22 కోట్లు జోడించుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐదో వీకెండ్‌లో దూసుకుపోతున్న ఛావా ‘పుష్ప 2’ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసింది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప‌2 చిత్రం ఐదో వీకెండ్‌లో 14 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే రికార్డును ఛావా దాటేసింది.బాహుబలి 2 విష‌యానికి వ‌స్తే ఈ మూవీ ఐదో వీకెండ్‌లోనూ అద‌ర‌గొట్టి అప్పట్లో 8.5 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. మరోవైపు ఇదే లిస్ట్‌లో ‘స్ట్రీ 2’ కూడా ఉంది. ఈ చిత్రం ఐదో వీకెండ్‌లో 16 కోట్ల వసూళ్లు సాధించి మంచి హిట్‌గా నిలిచింది. మొత్తంగా చూస్తే, హిందీ మార్కెట్‌లో ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలలో ఛావా రూ.22 కోట్లుతో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో స్త్రీ 2 -16 కోట్లు మూడో స్థానంలో పుష్ప 2: ది రూల్ – 14 కోట్లు , నాలుగో స్థానంలో యూరి – 12.50 కోట్లు ఐదో స్థానంలో బాహుబలి 2 – 8.5 కోట్లు నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read