నోట్లకట్టల వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఈరోజు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రైవేటు ఛాంబర్‌లో ఆయన ప్రమాణస్వీకారం జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణను ఆయనను ఎదుర్కొంటున్నందున అలహాబాద్ హైకోర్టులో ఎలాంటి న్యాయ విధులను అప్పగించలేదు. ప్రస్తుతం అలహాబాద్ చీఫ్ జస్టిస్ తర్వాత సీనియారిటీలో జస్టిస్ వర్మ ఆరో స్థానంలో ఉన్నారు.