హీరో ప్రభాస్ వెబ్ సైట్ ని రూపొందించాడు.వర్ధమాన సినీ రచయితలను ప్రోత్సహించేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ని నెలకొల్పాడు. ఈ వేదికపై కొత్త రచయితలు తమ ఆలోచనలను (కథలను) విస్తృతస్థాయిలో ప్రేక్షకులతో పంచుకోవచ్చు. తమ క్రియేటివిటీని ప్రదర్శించడం ద్వారా, ఔత్సాహిక రచయితలు ఎక్కువ మంది దృష్టిలో పడడానికి ఈ వేదిక సహాయపడుతుంది. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే… రచయితలు తమ కథలను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆడియన్స్ ఈ మినీ కథలను చదివి తమ ఫీడ్ బ్యాక్ తెలియజేసి, రేటింగ్ ఇస్తారు.
అత్యధిక రేటింగ్ వచ్చిన కథలకు, ఆ కథలు రాసిన రచయితలకు టాలీవుడ్ లో అసిస్టెంట్ రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ‘ఇమేజిన్ యువర్ ఫేవరెట్ హీరో విత్ సూపర్ పవర్స్’ పేరుతో ఓ పోటీ నిర్వహిస్తున్నారు. రచయితలు చేయాల్సిందల్లా… ప్రకటనలో పేర్కొన్న విధంగా 3,500 పదాలతో కథను రాసి ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ కు పంపించాలి. ఈ కథల్లో ఆడియన్స్ మెచ్చిన వాటికి టాప్ రేటింగ్ లభిస్తారు. ఆ టాప్ స్టోరీస్ రాసిన రైటర్లకు తగిన అవకాశాలు కల్పించే బాధ్యతను ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ తీసుకుంటుంది.